Mobile Popup Ad
Mobile Popup Ad

జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జ‌లసౌధలో తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS), అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సమీక్ష చేపట్టారు. గురువారం తుంగభద్ర జలాశయం గేట్ల ప్రారంభోత్సవ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతరాష్ట్ర సాగునీటి అంశాలు, తెలంగాణ నీటి హక్కుల రక్షణపై సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మీటింగ్ కు మంత్రి ఉత్తమ్, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్..

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు కర్ణాటక వెళ్లబోతున్నారు. ఉదయం 11 గంటలకు విజయనగర జిల్లాలోని హోస్పేట్‌లో తుంగభద్ర డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవంలో ఆ రాష్ట్ర సీఎం డీకే శివ కుమార్‌తో కలిసి పాల్గొంటారు. అనంతరం మునీరాబాద్ లో జరిగే ప్రజా సభలో పాల్గొననున్నారు.

Read Also: ‘టీచర్ల కొరతను తీర్చండి సారు’.. కలెక్టర్ కు విద్యార్థుల వినతి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>