Mobile Popup Ad
Mobile Popup Ad

పిల్లల్లో సీసం దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు

కలం, కరీంనగర్ బ్యూరో: పిల్లల ఆరోగ్యం, మేధోవికాసంపై సీసం (లెడ్) చూపే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘లీడ్ సేఫ్’ స్వచ్ఛంద సంస్థ కరీంనగర్ (Karimnagar) జిల్లాలో అవగాహన సదస్సు చేపట్టింది. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. “ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ త్రూ లీడ్ స్క్రీనింగ్, న్యూరోకాగ్నిటివ్ అసెస్‌మెంట్ అండ్ కమ్యూనిటీ” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు లెడ్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సీసం ప్రభావం కారణంగా పిల్లల మెదడు ఎదుగుదల లోపించడంతో పాటు ఆలోచనా శక్తి ఎలా దెబ్బతింటుందో న్యూరోకాగ్నిటివ్ అసెస్‌మెంట్ ద్వారా వివరించారు. విషపూరిత సీసపు ప్రభావం లేని సమాజాన్ని నిర్మించడంలో సమాజం, తల్లిదండ్రుల పాత్ర ఎంతగానో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, శిక్షణ కలెక్టర్ వరప్రసాద్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వెంకటేష్ , సౌమ్య మహేష్, జిల్లా విద్యాధికారి ప్రశాంత్ రెడ్డి, ఏఏపీసీ ఛైర్ పర్సన్ కవిత, కార్పొరేటర్ జగన్ రెడ్డి, కో ఆర్డినేటర్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు పాల్గొన్నారు.

Read Also: జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>