కలం, జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం జడ్పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయుల కొరత ఉందని, దీని వల్ల పాఠాలు బోధించే వారు కరువయ్యారని జెడ్పీహెచ్ ఎస్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆరగిద్ద జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను జిల్లా (Jogulamba Gadwal) కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
అలాగే పెంచికలపాడు గ్రామం నుంచి అరగిద్దలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 8, 9, 10వ తరగతికి చెందిన 24 మంది విద్యార్థులు రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే పాఠశాలలో 270 మంది విద్యార్థినిలకు కేవలం నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారని, ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.
Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్
Follow Us On: Instagram

