హుజూరాబాద్‌లో ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో (Huzurabad) కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ​ఏసీపీ మాధవి ఆదేశాల మేరకు హుజూరాబాద్ సీఐ కరుణాకర్ బృందం బుధవారం పరకాల క్రాస్ రోడ్‌లో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి లభ్యమైంది.

పట్టుబడిన వారిలో మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రాజేష్‌, వరంగల్ జిల్లాకు చెందిన ఫరూక్, రబ్బానీ ఉన్నారు. నిందితుల నుంచి 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాల విద్యార్థులకు గంజాయిని విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దీని వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>