Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యాసాగర్ రెడ్డిపై సమగ్ర విచారణ జరపాలి: కవిత

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మహిళల అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు.  హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్‌లో నిర్వహించిన డబ్ల్యూఈటీఏ (WETA) ఇండియా మహిళా సాధికారత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందని.. ఎంత కష్టపడినా ప్రతిభ చూపినా సరే మహిళకు ఎక్కడో అడ్డుకట్ట పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లపై సమాజంలో ఉన్న ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో 15–19 ఏళ్ల వయసున్న బాలికల్లో 7.2 శాతం మంది ఇప్పటికే తల్లులుగా మారగా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ సంఖ్య 2.7%గా ఉందని చెప్పారు. ప్రభుత్వాలు బాల్య వివాహాల నిర్మూలనకు అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ గణాంకాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చట్టాలతోనే సమస్య పరిష్కారం కాదని.. అవగాహన, విద్య, కుటుంబం-సమాజం కలిసి బాధ్యత తీసుకున్నప్పుడే మార్పు సాధ్యమవుతుందని అన్నారు. సమాజం మొత్తం కలిసి కృషి చేసినప్పుడే బాల్య వివాహాల నిర్మూలనతో పాటు నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు.

మహిళల స్వవలంబన కోసం ప్రభుత్వం స్త్రీనిధి సంస్థను ఏర్పాటు చేసిందని కవిత (Kavitha) అన్నారు. ఈ సంస్థ ఉద్యోగుల పట్ల అమానవీయంగా వ్యవహరించిన మాజీ ఎండీ విద్యాసాగర్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆధారాలలో సహా పలువురు ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి విద్యాసాగర్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించారని చెప్పారు. దీనిని భరించలేకే.. ఉద్యోగుల పట్ల కక్ష కట్టి 421 మందితో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. మరో 50 మందిని ఉద్యోగాల నుంచి తొలిగించారని మండిపడ్డారు.

ఈ దుశ్చర్యకు పాల్పడ్డ విద్యాసాగర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2025 డిసెంబర్ 24న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయగా సీఎం స్పందించి విచారణ కోసం ఆదేశించారని గుర్తు చేశారు. నామమాత్రంగానే విచారణకు ఆదేశించినా.. ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యంపై రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. స్త్రీనిధిలో (Streenidhi) రాజీనామా చేసిన, తొలగింపునకు గురైన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.

Read Also : హైడ్రా భారీ ఆపరేషన్: వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>