కలం, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం భయానక వాతావరణాన్ని సృష్టించింది. అలీగంజ్‌లోని పూర్ణియాలో ఓ కోచింగ్ సెంటర్ భవనంలో అకస్మాత్తుగా మంటలు (Lucknow fire accident) చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న షాపులో చెలరేగిన మంటలు.. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు వ్యాపించాయి. దీంతో భయబ్రాంతులకు గురైన పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకారు. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన భవనం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

