కలం, నిజామాబాద్ బ్యూరో: యూరియా యాప్ (Urea App)కు వ్యతిరేకంగా రైతుల (Farmers) ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటీవల నిజామాబాద్లో పలు గ్రామాల రైతులు నిరసనలు చేపట్టగా తాజాగా కామారెడ్డి (Kamareddy) జిల్లా రామారెడ్డి మండలంలోని ఉప్పలగాయిలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం తక్షణమే యూరియా యాప్ తొలగించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు వేసే సమయంలో యూరియా కోసం ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉప్పలవాయి-రామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వం వెంటనే యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువులు ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

