ఘనంగా ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వర్ధంతి

కలం, నిర్మల్ : నిర్మల్ ( Nirmal) జిల్లా కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు విద్యార్ధి దశ నుండే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలను చైతన్య పరిచిన మహానీయుడని కొనియాడారు. తెలంగాణ సాధనను కళ్ళారా చూడాలని ఎంతగానే కోరుకుని చివరికి అది తీరేలోపే కన్నుమూశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పితామహుడు జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: సీఎం రేవంత్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్ లేఖ‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>