కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు (Sai Krishna Missing Case) విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు సిట్ (SIT)ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐజీ రవి ప్రకాశ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులు ఈ కేసును విచారించనున్నారు. సభ్యులుగా ఉన్న ముగ్గురిలో పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్ సుధాకర్‌లు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసు వ్యవహారంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం చంద్రబాబు సాయికృష్ణ తల్లిని కలిసి పరామర్శించారు. ఈ కేసులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

