రైతులకు గుడ్‌న్యూస్.. రూ. 9 కోట్లతో 30 గోదాములు మంజూరు

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో రైతుల కోసం 30 గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు గోదాముల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, ఎంఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు తెలిపారు.

నర్సాపూర్ (జి) – 1, దిల్వార్పూర్ – 3, లక్ష్మణచందా – 5, మామడ – 3, నిర్మల్ రూరల్ – 5, సారంగాపూర్ – 8, సోన్ – 5 గోదాములు మంజూరయ్యాయి. ఇటీవల గోదాముల కొరత కారణంగా రైతులు ధాన్యం నిల్వ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఈ గోదాముల నిర్మాణంతో రైతులకు ఎంతో ఉపశమనం లభించనుంది. రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఇది కీలక ముందడుగు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>