నాందేడ్ హైవే పై రోడ్డు ప్ర‌మాదం.. ఒకరి మృతి

క‌లం, మెద‌క్ బ్యూరో : సంగారెడ్డి  (Sangareddy Accident) జిల్లా చౌటాకూర్ మండ‌లం శివ్వంపేట వద్ద గల నాందేడ్ -అకోలా 161 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. సంగారెడ్డి డిపోకు చెందిన‌ ఆర్టీసీ బస్సు బైక్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో పుర్ర వైష్ణవి (13) అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సదాశివపేట (మం) పెద్దాపూర్ కు చెందిన వైష్ణవిగా గుర్తించారు.

ఇదే ప్రమాదంలో పుల్కల్ (మం) మిన్ పూర్ గ్రామానికి చెందిన మ‌రో ముగ్గురుకు స్వ‌ల్పంగా గాయ‌ల‌య్యాయి. మిన్ పూర్ గ్రామంలో తమ బంధువుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఆదివారం ఫసల్వాది విద్యాపీఠంలో భరతనాట్యం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: ‘ మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>