కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని రామాలయ ఫంక్షన్ హాల్ లో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ (Moku Debba) నిజామాబాద్ జిల్లా 2వ మహాసభలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కోటగిరి అరుణ్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించారు. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గౌడ జనహక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజ్ గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీపతి లింగాగౌడ్ ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలల్ సాయిబాబాగౌడ్ గార్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వక్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ డివిజన్లో దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీసీ గ్రామ అభివృద్ధి కమిటీల పేరిట గీత కార్మికులపై దళితులపై బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేస్తూ సాంఘిక బహిష్కరణలు గురిచేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనీ అన్నారు. మాటలు వినని వారిపై సాంఘిక బహిష్కరణ గురిచేస్తూ భౌతిక దాడులకు దిగుతూ రాజకీయ అండదండలతో అన్ని రంగాలలో బడుగు బలహీన వర్గాల ప్రజలను అణిచివేస్తున్నారని ఖండించారు. వారి పైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల తాళ్లరాంపూర్లో జరిగిన గౌడ కులస్తులపై దళితులపై వివిధ బడుగు బలహీన వర్గాల కులవృత్తుల వారిపై విలేకరులు ప్రభుత్వ అధికారులు పోలీసు ఎక్సైజ్ అధికారులపై దాడులు చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బడుగు బలహీన వర్గ సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ వారి పైన ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.. తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించి బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. నూతన కార్యవర్గం కూడా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు. కిషన్ గౌడ్, పడాల రాజేందర్ గౌడ్, వేంపల్లి సరోజగౌడ్, కొండగొని రవీందర్ గౌడ్, పోగుల నగేష్ గౌడ్, జిల్లా నాయకులు చేపూరి జనాగౌడ్, మెరుగు శ్రీనివాస్ గౌడ్, మసగోని రమేష్ గౌడ్, బొజ్జా చిన్నా గౌడ్, రంగుల సిరి గౌడ్, భైరగోని సాయగౌడ్, రంగారి పోషగౌడ్, బూరుగు రాజా గౌడ్, తెలంగాణ గౌడ మహిళా సంఘం నాయకురాళ్లు భైరగోని విజయ, లక్ష్మి, బొంగోని భాగ్య లత, మండల నాయకులు సత్య గౌడ్, లింబా గౌడ్, తిరుపతి గౌడ్ ఉపేందర్ గౌడ్, జిల్లాలోని వివిధ గ్రామాల గౌడ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు.

