సమ్మర్‌కి ఏసీని సర్వీస్ చేయిస్తున్నారా.. ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి

కలం, వెబ్ డెస్క్ : ఎండలు మండిపోయే కాలం వచ్చేస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే ఎండలు కూడా మండిపోతున్నాయి. ఇప్పటికే ఎండ 40 డిగ్రీల సెల్సియస్‌ను కూడా దాటేసింది. దీంతో ప్రజలంతా మరోసారి తమ ఇంట్లో దుమ్ముపట్టేసి ఉన్న ఏసీల వైపు చూస్తున్నారు. చలికాలం అంతా మూలనపడ్డ ఏసీని మళ్లీ ఆన్ చేసే సమయం ఆసన్నమైంది. అయితే, ఏసీని నేరుగా వాడటం కంటే, అది మొరాయించకుండా ఉండాలంటే ముందే సర్వీసింగ్ (AC Service) చేయించుకోవడం అత్యవసరం. ఒక్కోసారి సర్వీసింగ్ చేయించినా కొన్ని రోజులకే ఏసీలు మొరాయిస్తాయి. సరిగ్గా చల్లదనాన్ని అందించవు. అలా జగకుండా ఉండాలంటే టెక్నీషియన్ (Technician)వచ్చినప్పుడు ఐదు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకోవాల్సిందే.

సాధారణంగా చలికాలంలో ఏసీలను మనం పెద్దగా వాడడం జరగదు. దీనివల్ల ఫిల్టర్లు, కాయిల్స్‌లో దుమ్ము పేరుకుపోతుంది. వేసవిలో ఒక్కసారిగా ఎక్కువ గంటలు ఏసీ వాడినప్పుడు, లోపల చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే అవి పెద్దవిగా మారి ఏసీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే సీజన్ ప్రారంభంలోనే సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, కూలింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

సర్వీసింగ్ సమయంలో మీరు టెక్నీషియన్‌ను అడగాల్సిన అంశాలు ఇవే:
ఏయే భాగాలను తనిఖీ చేస్తున్నారు?:

సర్వీసింగ్ (AC Service) అంటే కేవలం ఫిల్టర్లు కడగడం మాత్రమే కాదు. ఇండోర్, అవుట్‌డోర్ యూనిట్లు, కాయిల్స్, ఫ్యాన్ పనితీరు, థర్మోస్టాట్‌ను కూడా చెక్ చేయమని టెక్నీషియన్‌ను అడగాలి.

గ్యాస్ లెవల్ సరిగ్గా ఉందా?:

ఏసీలో కూలింగ్ సరిగ్గా ఉండాలంటే రిఫ్రిజెరెంట్ గ్యాస్ స్థాయి కరెక్ట్‌గా ఉండాలి. ఒకవేళ గ్యాస్ తక్కువగా ఉంటే, ఎక్కడైనా లీకేజీలు ఉన్నాయేమో పరిశీలించమని కోరాలి.

డ్రైనేజీ పైపు క్లీనింగ్:

ఏసీ నుండి వచ్చే నీరు బయటకు వెళ్లే పైపులో దుమ్ము లేదా నాచు పేరుకుపోతే నీరు లోపలికి లీక్ అవుతుంది. కాబట్టి డ్రైనేజీ పైపును తప్పనిసరిగా శుభ్రం చేయించాలి.

వైరింగ్ భద్రత:

ఏసీకి కనెక్షన్ ఇచ్చే వైర్లు, స్విచ్‌లు, కెపాసిటర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో చూడాలి. లూజ్ కనెక్షన్లు ఉంటే ఏసీ హఠాత్తుగా ఆగిపోయే అవకాశం ఉంది.

ఏవైనా భాగాలు మార్చాలా? :

ఫ్యాన్ పార్ట్స్ లేదా ఇతర చిన్న చిన్న విడిభాగాలు అరిగిపోయి ఉంటే, వాటిని ఇప్పుడే మార్చుకోవడం మేలు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద ఖర్చులను నివారించవచ్చు.

Read Also: ఆ దేశంలో బంగారం ధరలు భారీగా పతనం

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>