Mobile Popup Ad
Mobile Popup Ad

సర్‌ప్రైజ్ అని చెప్పి ప్రియుడికి నిప్పంటించిన యువతి

కలం, వెబ్ డెస్క్ : కర్నాటక దారుణం జరిగింది. ఓ యువతి సర్‌ప్రైజ్ అంటూ తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచింది. డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తానని ప్లాన్ చేసి నిప్పంటించి సజీవ దహనం చేసింది. బెంగళూర్‌‌ (Bengaluru) కు చెందిన ప్రేరణ, కిరణ్‌ (27) స్థానికంగా ఉన్న మొబైల్ స్టోర్‌‌లో పని చేస్తున్నారు. ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే కిరణ్ తనను సరిగా పట్టించుకోవడం లేదని, అంతకుముందు లాగా ప్రేమ చూపించడం లేదని, పెళ్లి చేసుకోడేమోనని ప్రేరణ అనుకుంది. ఈ క్రమంలో మంగళవారం కిరణ్‌ను ఇంటికి రమ్మని పిలిచింది. డిఫరెంట్‌గా ప్రపోజ్‌ చేసేందుకు ప్లాన్ చేశానని అతణ్ని నమ్మించింది. కండ్లకు గంతలు కట్టి, కూర్చీలో కూర్చోబెట్టి కట్టేసింది. ఆ తర్వాత మండే స్వభావం ఉన్న కెమికల్‌ను మీద పోసి నిప్పంటించింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>