కలం, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్టేరులో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని, సైకిల్ తొక్కడం ప్రారంభించారు. ఈ క్రమంలో చీర చక్రంలో చిక్కుకుపోవడంతో కిందపడిపోయారు. వెంటనే గమనించిన భద్రతా సిబ్బంది పైకి లేపారు. అనంతరం, కొద్ది సేపు సైకిల్ తొక్కి అక్కడకు వచ్చినవారికి పర్యావరణంపై అవగాహన కల్పించారు.

