‘బరి’మూవీ సెట్స్ లో ప్రమాదం.. హీరో వరుణ్ తేజ్ కు గాయం!

కలం, వెబ్ డెస్క్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా ‘బరి’ అనే సినిమా ఇటీవల అనౌన్స్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కమిటీ కుర్రోళ్ళు మూవీ ఫేమ్ యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వరుణ్​ తేజ్ చెల్లి నిహారిక నిర్మిస్తుండడం విశేషం. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సినిమా కోసం వరుణ్ తేజ్ కొంతకాలంగా వాలీబాల్ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే  ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ వెంటనే వరుణ్ తేజ్ ను అపోలో ఆసుపత్రికి తరలించగా.. ఆయనుకు చిన్న పాటి సర్జరీ జరిగిందట. వైద్యులు వరుణ్ తేజ్ కు కొన్ని వారలు విశ్రాంతిని సూచించారని సమాచారం అందుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‌ ఇటీవల కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. దీంతో ఎలాగైన సరైన హిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉన్నారు. వాలీబాల్ ఆట నేపథ్యంలో సాగే ‘బరి’ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందులో వాలీబాల్ ప్లేయర్ గా వరుణ్​ తేజ్ కనిపించనున్నారు. దీనికోసం కొద్ది రోజులుగా ఆ క్రీడలో శిక్షణ తీసుకుంటుండగా.. తాజాగా ఈ  ఘటన చోటు చేసుకుంది. అటు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘ కొరియన్ కనకరాజు ’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే వరుణ్ తేజ్ కి గాయం కావడంతో ఈ సినిమాల షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత వరుణ్ తేజ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో పాల్గొననున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>