మెక్సికో వేదికపై “వారణాసి” సందడి

కలం, సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి'(Varanasi).. తొలిసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన రాజమౌళి.. వారణాసి (Varanasi) సినిమాతో మరోసారి గ్లోబల్ మార్కెట్‌ని టార్గెట్ చేశారు. అందులో భాగంగా ప్రపంచ వేదికపై ‘వారణాసి’ సినిమా తన తొలి అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.

మెక్సికో(Mexico)లో జరుగుతున్న అంతర్జాతీయ ఈవెంట్ CCXPMX26లో ఏప్రిల్ 24న థండర్ స్టేజ్‌పై ప్రత్యేక ప్యానెల్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ స్థాయిలో పరిచయం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ‘వారణాసి టూ ద వరల్డ్’ అనే పేరుతో స్పెషల్ గ్లింప్స్ ప్రదర్శించనున్నారు. అలాగే రాజమౌళి తనయుడు, నిర్మాత ఎస్‌.ఎస్‌. కార్తికేయ గ్లోబల్ ఆడియన్స్‌తో లైవ్ ఇంటరాక్షన్‌లో పాల్గొననున్నారు. ఈ భారీ వేదికపై  దర్శకుడు రాజమౌళి పంపిన స్పెషల్ వీడియో మెసేజ్‌ను, అలాగే అక్కడ హాజరైన వారందరి కోసం వారణాసి (Varanasi) మూవీకి సంబంధించి బిహైండ్ ద సీన్స్ ప్రదర్శిస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>