విజయవాడ రాజకీయాల్లో కీలక మలుపు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు, కాపు నేత వంగ‌వీటి రాధాకృష్ణ‌ (Vangaveeti Radha Krishna) జ‌న‌సేన పార్టీలో చేరారు. విజ‌య‌వాడ మేయ‌ర్ రేసులో వంగ‌వీటి రాధా ఉన్న‌ట్లు కొద్ది రోజులుగా ప్ర‌చారం న‌డుస్తోంది. కూట‌మి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జ‌న‌సేన‌కు కేటాయించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేడు జ‌న‌సేన‌లో చేర‌డం హాట్ టాపిక్‌గా మారింది. జ‌న‌సేన‌ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాధా దంప‌తుల‌కు స్వ‌యంగా కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాధా జ‌న‌సేన‌(Janasena)లో చేరుతున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. కాబోయే మేయ‌ర్ అంటూ ఫ్యాన్స్ ఫ్లెక్సీల్లో రాధా, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫోటోలను ప్ర‌ద‌ర్శించారు. అయితే రాధా భార్య పుష్ప‌వ‌ల్లి మేయ‌ర్ పీఠం ఎక్కుతార‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు వంగవీటి రాధా (Vangaveeti Radha Krishna) చేరికతో కాపుల్లో జ‌న‌సేన బ‌లం మ‌రింత పెరుగ‌నుంది.

Also Read : జగన్ అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు కీలక నిర్ణయం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>