కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో కారు బీభత్సం సృష్టించింది. ఉప్పల్ లో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో (Uppal Car Accident) ముందు వెళ్తున్న కారు మూడు పల్టీలు కొట్టి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కరెంట్ పోల్ విరిగి కారుపై పడింది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాద సమయంలో కార్లలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

