Mobile Popup Ad
Mobile Popup Ad

ఎన్నికల ప్రచారంలో మోకాళ్లపై నడిచిన విజయ్

కలం, వెబ్​ డెస్క్​: తమిళగ వెట్రి కళగం (TVK Chief) అధినేత, నటుడు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతన్నాడు. ఇతర పార్టీలకు భిన్నంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నాడు. ఆదివారం ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా భక్తిభావాన్ని చాటుకున్నారు. తిరుచ్చి పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రసిద్ధ సెయింట్ ఆంటోనీ చర్చిని (Trichy Antony Church) సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ తన భక్తిని చాటుకుంటూ చర్చి లోపల మోకాళ్లపై నడిచి ఆశ్చర్యపరిచాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరయ్యేందుకు విజయ్ చేస్తున్న ప్రచార తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. తన రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది.

Read Also: రెండో ‘సారీ’.. ప్రజలకు ప్రధాని మోడీ…

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>