Mobile Popup Ad
Mobile Popup Ad

త్రివిక్రమ్ మూవీ.. తమన్ ఈజ్ బ్యాక్?

కలం, వెబ్ డెస్క్: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ (Trivikram) విక్టరీ వెంకటేశ్ తో కలిసి ‘ఆదర్శ కుటుంబం’ అనే మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ అని ముందే ప్రకటించారు. ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్నాడట. అందుకు కారణాలు స్పష్టంగా తెలియరాలేకపోయినా.. క్రియేటివ్ డిఫరెన్స్ అనే టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వేసవి కానుకగా విడుదల చేస్తామని ముందే ప్రకటించారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ మార్పు అంటూ వస్తున్న గాసిప్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి.

మళ్లీ తమన్ వద్దకే..

త్రివిక్రమ్–తమన్ కాంబోలో అరవింద సమేత, అల వైకుంఠపురంలో, గుంటూరు కారం వంటి వరుస మ్యూజికల్ హిట్లు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపాయి. సక్సెస్ ఫుల్ కాంబోగా ముద్రపడిపోయారు. అయితే, వెంకీతో మూవీకి మాత్రం త్రివిక్రమ్ హర్షవర్ధన్ వైపు చూశారు. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో తిరిగి ఈ ప్రాజెక్ట్ తమన్ వద్దకే వచ్చిందని వినిపిస్తోంది. త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభిస్తారని ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>