కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజైన సోమవారం శ్రీ మలయప్పస్వామి ఉభయ దేవేరులతో స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో శ్రీవారి సేవలో పాల్గొని గోవింద నామస్మరణలతో స్వర్ణ రథాన్ని ముందుకు లాగుతూ పరవశించిపోయారు.
మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ వైభవంగా స్వర్ణరథోత్సవ కార్యక్రమం జరిగింది. సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీవారి అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం ఉస్వామివారికి పుష్కరిణిలో ‘చక్రస్నాన మహోత్సవం జరుగనుంది. ఈ క్రతువుతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

