కలం, వెబ్ డెస్క్ : తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Tirumala Brahmotsavam) వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి మోహినీ అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. విశేషమైన దివ్యాభరణాలు, సంప్రదాయ అలంకరణలతో మెరిసిపోతున్న స్వామివారి అవతారాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఈ దివ్య ఊరేగింపులో స్వామివారితో పాటు ప్రత్యేక తిరుచ్చిపై శ్రీకృష్ణ స్వామివారు కూడా వేంచేశారు.
మంగళవాయిద్యాలు, భక్తుల భజనల కోలాహలం నడుమ స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. కోలాటాల నృత్యాలు, జీయంగార్ల వేద మంత్రోచ్ఛారణలతో తిరుమల వీధులన్నీ మార్మోగిపోయాయి. గజరాజుల సేవ నడుమ వైభవంగా సాగిన ఈ ఊరేగింపులో శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.

