కలం, బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో (Basara Saraswati Temple) మూల నక్షత్రం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చేసిన ఏర్పాట్లపై ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రశంసించారు. శుక్రవారం ఆయన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతుండటంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు కృషి చేయాలని (MLA Pawar Ramarao Patel) ఆకాంక్షించారు. ఎల్నినో ప్రభావంతో వేసవిలో కరువు పరిస్థితులు తలెత్తకుండా, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని సరస్వతీ అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.

