కలం, సినిమా : టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker), హీరోయిన్ ఈషా రెబ్బ (Eesha Rebba) కలిసి వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పండుగ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను తరుణ్ భాస్కర్ ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్‌పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఎయిర్ పోర్ట్, షాపింగ్ మాల్స్‌లో కనిపించిన వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ షూటింగ్ సమయంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ మధ్య ప్రేమ మొదలైనట్లు న్యూస్ వైరల్ అయింది. అయితే ఈ విషయంపై ఇద్దరూ అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. ఈషా రెబ్బ తనకు బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువని, తమ బంధం గురించి సరైన సందర్భంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని తరుణ్ భాస్కర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఇద్దరూ కలిసి కనిపించడంతో మరోసారి వీరి రిలేషన్‌షిప్‌పై చర్చ మొదలైంది.

