ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వీక్లి పాస్! 

కలం, వెబ్ డెస్క్ : ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) శుభవార్త అందించింది. నగర వాసుల సౌకర్యార్థం సరికొత్త వీక్లీ పాస్ (TGSRTC Weekly Pass) పథకానికి శ్రీకారం చుట్టింది. కేవలం రూ.600 చెల్లించి ఈ పాస్ ను కొనుగోలు చేస్తే, వారం రోజుల పాటు సిటీ పరిధిలోని అన్ని రకాల బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.

సాధారణ ఎక్స్‌ప్రెస్ బస్సులతో పాటు ఏసీ బస్సుల్లోనూ ఈ పాస్ ద్వారా ప్రయాణం చేయవచ్చు. నగరంలోని అన్ని సిటీ బస్ కేంద్రాలలో ఈ వీక్లీ పాస్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రోజూ రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు ఇతర ప్రయాణికులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, తద్వారా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>