మార్చురీలో మృతదేహాలు కుళ్ళిపోవడం దారుణం: లక్ష్మారెడ్డి

కలం, జడ్చర్ల: జడ్చర్ల వంద పడకల హాస్పిటల్ మార్చురీలో మృతదేహాలు కుళ్ళిపోవడం దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Laxma Reddy) అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అత్యవసర సేవలు అందించే గవర్నమెంట్ హాస్పిటల్ (Jadcherla Hospital)కి కోతల్లేని విద్యుత్ ఇవ్వలేక పోతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్తులు మరణించి తీవ్ర దుఃఖంలో ఉండే కుటుంబ సభ్యులకు మృతదేహాలను గౌరవంగా అప్పగించాల్సిన బాధ్యత ఉంటుందని, కానీ నిర్లక్ష్యంతో కుళ్ళిన మృతదేహాలు ఇవ్వడం హేయమైన చర్య అన్నారు.

గతంలో కూడా మృతదేహాలను కుక్కలు పీక్కుతినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి ఘటనలు చూశామని చెప్పారు. అయినప్పటికీ హాస్పిటల్ లో సేవలు మెరుగు పడలేదని  మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్య సేవలు, వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>