Mobile Popup Ad
Mobile Popup Ad

రేపే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు కీలక అప్డేట్ వెలువడింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలను (TG Inter Supply Results 2026) రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రేపు (జూన్ 11) ఉదయం 11:30 గంటలకు ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల అవుతాయి.

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ సప్లిమెంటరీ పరీక్షలు ముఖ్యంగా ప్రధాన పరీక్షలలో ఫెయిల్ అయిన లేదా మార్కులు మెరుగుపరుచుకోవాలనుకున్న విద్యార్థులకు ఎంతో కీలకం. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్యలో ముందడుగు వేసే అవకాశం లభిస్తుంది. ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారానే తమ రిజల్ట్స్‌ను చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>