కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టణంలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు విరుచుకుపడ్డారు (Rayachoti attack). కార్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించిన కొందరు అక్కడున్న ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా కార్యాలయానికి నిప్పుపెట్టడానికి ప్రయత్నించారు. ఈ దాడి సమయంలో కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉన్న పలు ద్విచక్ర వాహనాలు, కార్లను అగంతకులు ధ్వంసం చేసి తగలబెట్టారు.
ఈ సమయంలో అక్కడ నిలిపి ఉంచిన పలు ద్విచక్ర వాహనాలు, కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గాయాలపాలైన బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనతో రాయచోటి పట్టణంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

