కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో (Telangana) ఈ నెల 15వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రారంభమైన ‘బడిబాట’ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనుంది. జనవరిలోగా పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డీఈవో, ఎంఈవోలు పర్యవేక్షణ చేయడంతో పాటు హెడ్మాస్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. మార్చి నెలలో తుది పరీక్షలు నిర్వహించనున్నారు.
సెలవులు ఇలా..
ప్రధాన పండుగలకు సంబంధించి సెలవులను కూడా ప్రకటించింది. అక్టోబరులో జరిగే బతుకమ్మ, దసరా సెలవులకు 13 రోజులు, డిసెంబరులో 5 రోజుల పాటు క్రిస్మస్, జనవరి నెలలో 5 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనుంది.

