కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఏర్పడే కరువు పరిస్థితులను నిరంతరం సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిని సభ్యులుగా నియమించింది.
ఎల్ నినో కారణంగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేయడం, కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రానికి అవసరమైన నిధులు, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
Also Read : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు
Follow Us On: Youtube

