కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు

కలం, వెబ్ డెస్క్: ముగ్గురు కాంగ్రెస్ కీలక నేతలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ (BRS Legal Cell) నోటీసులు జారీ చేసింది. తమ పార్టీ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti), ఎంపీ గడ్డం వంశీకృష్ణకు నోటీసులు పంపించింది. కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ అక్రమంగా తన ఫాంహౌస్‌కు మళ్లించుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందులో పేర్కొంది.

దుష్ప్రచారం చేస్తూ పెట్టిన పోస్టులను వెంటనే తొలగించి, 24 గంటల్లోగా క్షమాపణలు చెబుతూ ప్రకటనలు చేయాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ (BRS Legal Cell) డిమాండ్‌ చేసింది. లేకపోతే పరువు నష్టం సహా ఇతర న్యాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు లీగల్ సెల్ ఇన్‌‌ఛార్జి సోమ భరత్ కుమార్ నోటీసులు పంపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ సహించబోదని స్పష్టం చేసింది.

Also Read : చ‌ర్చిలో త‌ల‌పై శిలువ ప‌డి ఫాద‌ర్ మృతి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>