గద్వాలలో రైతుల విద్యుత్ నిరసన.. 24 గంటల సరఫరాకు డిమాండ్

కలం, జోగులాంబ గద్వాల: ఎన్నికల సమయంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు తీరని అన్యాయం చేస్తోందని బీజేపీ జిల్లా నాయకురాలు డీకే స్నిగ్ధా రెడ్డి (DK Snigdha Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన విద్యుత్ హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ధరలు కిష్టన్న ఆధ్వర్యంలో సోమవారం గద్వాల పట్టణంలోని విద్యుత్ SE కార్యాలయం వద్ద నిర్వహించిన రైతుల నిరసన దీక్షా కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి కనీసం 5-6 గంటలు కూడా ఇవ్వడం లేదని, పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతల వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ​మలో- వోల్టేజ్ వల్ల రోజువారీగా వందలాది బోర్ మోటార్లు కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

​కేంద్ర ప్రభుత్వం బొగ్గు సరఫరా నిరంతరాయంగా అందిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణా లోపం, నిధుల విడుదల లేకపోవడం వల్లే ఈ కొరత ఏర్పడిందన్నారు. ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను అమలు చేయకపోవడం వల్ల పంటలు నష్టపోయినా రైతులకు పరిహారం అందడం లేదు అని అన్నారు.
​
రైతులకు లో- వోల్టేజ్ సమస్య లేకుండా పగటిపూట కనీసం 12 గంటల నాణ్యమైన త్రీ -ఫేజ్ విద్యుత్ ఇవ్వడంతో పాటు, ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల విద్యుత్ తక్షణమే పునరుద్ధరించాలి అని డిమాండ్ చేస్తూ..‌ విద్యుత్ శాఖ డీఈ రవి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ​

ఈ‌ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, బలిగేరా శివారెడ్డి, రజక జయశ్రీ, బాబుల్ రెడ్డి, దాస్, వెంకటేశ్వర రెడ్డి, మురళీధర్ రెడ్డి, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, రైతులు‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>