తెలంగాణ అసెంబ్లీకి ఎక్స్‌ట్రా డే.. సీఎం రేవంత్ కీలక భేటీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) షెడ్యూల్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వాయిదా వేసిన స్పీకర్.. అసెంబ్లీ సమావేశాలను ఒకరోజుకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి నేటి వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉండేది. అయితే ఎల్‌నిలో పై చర్చ దృష్ట్యా సమావేశాన్ని ఒకరోజుకు పొడిగించారు.

దీంతో బుధవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎల్‌నినోపై చర్చ జరగనుంది. ఎల్‌నినో పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలి? రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ సభ్యులు చర్చించనున్నారు. కాగా, తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. మరోవైపు ఈ నెల 15న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చ జరగనుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>