కలం, జోగులాంబ గద్వాల: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గద్వాల పట్టణంలోని రెండో వార్డులో వెలసిన శ్రీశ్రీశ్రీ శక్తి స్వరూపిణి తాయమ్మ అమ్మవారు (Gadwal Tayamma Ammavaru) శుక్రవారం ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని సుమారు రూ.1.50 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అందించిన తీర్థప్రసాదాలను స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక అలంకారం భక్తులను ఆకట్టుకుంది.

