‘సర్’ లేకుండానే చాలా రాష్ట్రాల్లో గెలిచాం: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: దేశంలో సర్(SIR) ప్రక్రియ, ఓట్ చోరీ, సీఈఓ జ్ఞానేష్ కుమార్ (Gyanesh Kumar) పై ఇండి కూటమి చేస్తున్న తీవ్ర ఆరోపణనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పలు రాష్ట్రాల్లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో సర్ ప్రక్రియతో సంబంధం లేకుండానే బీజేపీ గెలిచిందని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. దేశంలో ఓట్ చోరీ జరగలేదని.. చోరులకు ప్రజలు ఓటేయడం లేదని ఎద్దేవా చేశారు.

సర్ ప్రక్రియ లేకుండానే చాలా రాష్ట్రాల్లో గెలిచామన్న కిషన్ రెడ్డి (Kishan Reddy).. దమ్ముంటే రాహుల్‌గాంధీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. క‌ర్నాట‌క‌, తెలంగాణ‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, కేర‌ళ‌లో వాళ్ళు గెలిస్తే ఈసీ, ఈవీఎంలు బెస్ట్ అని.. అదే బీజేపీ గెలిస్తే మెషిన్లు త‌ప్పు, ఈసీది తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని చూసి దేశ ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారని విమర్శించారు.

Also Read : రూ.1.50 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా తాయమ్మ అమ్మవారు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>