కలం, వెబ్ డెస్క్ : దేశంలో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు జరిగిందనే ఆరోపణలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలను సవాలు చేస్తూ విపక్ష నేత రాహుల్ గాంధీ, ‘ఇండియా’ కూటమి నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు (Supreme Court) స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వానికి విచారణ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు సంబంధించిన పూర్తి రికార్డులు, దస్త్రాలను తమ ముందు ఉంచాలని ఈసీని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) ఆదేశించింది. ఓటర్ల జాబితా లెక్కింపు, సవరణల నిమిత్తం చేపట్టిన ఈ సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తూ స్టే విధించాలని, తొలగించిన ఓటర్ల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు తమ పిటిషన్లో కోరారు. విపక్షాల ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యవహారంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్లకు నోటీసులు పంపింది.
Also Read : సారీ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. కారణమిదే!
Follow Us On: Instagram

