కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా ఇంటర్నెట్ ఆఫ్ చేయడంపై కేంద్ర హోం శాఖ సుప్రీం కోర్టుకు సారీ చెప్పింది. శాంతి భద్రతల కోసం మాత్రమే ఇంటర్నెట్ నిలిపేయాల్సి వచ్చిందని హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ (Govind Mohan) వివరించారు. అందుకు బేషరతుగా క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు.
రాష్ట్రపతి భవన్, రైసినా హిల్స్ పరిసరాల్లోని 4 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే నెట్ ఆఫ్ (Internet Shutdown) చేశామని.. అది కూడా కేవలం మొబైల్ డేటా సేవలకు మాత్రమే వర్తింపజేసినట్లు గోవింద్ మోహన్ (Govind Mohan) వివరించారు. ఇక నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.
సుప్రీం కోర్టు చెప్పినా..
కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల ఢిల్లీలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించింది. మెట్రో స్టేషన్లను కూడా మూసేసింది. అంతకుముందే ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు.. ఇంటర్నెట్ ఆఫ్ చేసి సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించవద్దని సూచించింది. అయినా పలు చోట్ల ఆంక్షలు విధించడంతో తాము ఇబ్బంది పడ్డామని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయగా.. క్షమాపణ చెబుతూ కేంద్ర హోం శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది.
Also Read : రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం
Follow Us On: X(Twitter)

