వనపర్తిలో చిన్నారి హన్వికను పరామర్శించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కలం, వనపర్తి: TUWJ(IJU) జర్నలిస్టు యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు, కలం డైలీ న్యూస్ వనపర్తి రిపోర్టర్ తైలం అరుణ్‌రాజ్‌ కుమార్తె హన్వికను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) గురువారం పరామర్శించారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న హన్విక వనపర్తి పట్టణంలోని మేఘన రెయిన్‌బో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ విషయం తెలుసుకున్న నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) ఆసుపత్రికి వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యుడు డాక్టర్‌ మూడావత్‌ పంతులాల్‌కు సూచించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, మీడియా సెల్‌ కన్వీనర్‌ నందిమల్ల అశోక్‌, కౌన్సిలర్‌ భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి జిల్లా ఇన్‌చార్జి ముంత భాస్కర్‌యాదవ్‌, ప్రజాజ్యోతి రిపోర్టర్‌ సంద రఘుబాబు, విజయ్‌, యూకే శ్రీనివాసులు, యువ నాయకులు వంశీ, పానుగంటి సురేశ్‌, పిట్టల రాములు తదితరులు ఉన్నారు.

Also Read : ఐఏఎస్‌లకు యాదాద్రి ప్లాంట్‌ పర్యవేక్షణ బాధ్యత

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>