కలం, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Chintalapudi Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 17 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

