మ‌హిళా దినోత్స‌వం.. స‌మంత మూవీ నుంచి స్పెష‌ల్ వీడియో!

క‌లం, వెబ్ డెస్క్‌: నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). యాక్ష‌న్, డ్రామా క‌ల‌గ‌లిపి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాను స‌మంత సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ టీం విడుద‌ల చేసిన‌ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త‌ర‌చూ మూవీ నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇటీవ‌ల హోలీ వీడియో విడుద‌ల చేసిన మూవీ టీం తాజాగా ఉమెన్స్ డే (Womens Day) సంద‌ర్భంగా మ‌రో వీడియోను ఆడియెన్స్‌తో పంచుకున్నారు.

మ‌హిళ‌లు ఆఫ్ మా ఇంటి బంగారం అంటూ సినిమాలోని మ‌హిళా క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేశారు. ఇందులో సమంతతో (Samantha) పాటు సీనియ‌ర్ న‌టి గౌత‌మి, శ్రీల‌క్ష్మి, శ్రీముఖి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ సినిమాను మే 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్పటికే నందినీ రెడ్డి, స‌మంత కాంబినేష‌న్‌లో ఓ బేబీ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఉంది. మ‌రి మా ఇంటి బంగారం ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

Read Also: బెంగ‌ళూరులో ఎన్టీఆర్ క్రేజ్‌.. సీఎం నినాదాల‌తో హోరెత్తించిన ఫ్యాన్స్!

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>