ఎన్‌పీఎల్‌ సీజన్‌-3 విజేతగా ఎస్‌కేవై 11 జట్టు

కలం, వనపర్తి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగవరంలో నాగవరం ప్రీమియర్ లీగ్‌ సీజన్‌–3 (NPL Season 3) క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వాహకులు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్‌కేవై 11 జట్టు విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేత జట్టుకు అందించే ట్రోఫీతోపాటు నగదు బహుమతిని నీరజ్‌ ముదిరాజ్‌ స్పాన్సర్‌ చేశారు. విజేతలకు ముఖ్య అతిథి, సీనియర్‌ జర్నలిస్టు బాలస్వామి మల్యాల బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. రన్నరప్‌ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ట్రోఫీ స్పాన్సర్‌ నీరజ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. క్రీడాకారులు ఐక్యతతో మెలుగుతూ క్రికెట్‌లో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని, భవిష్యత్తులోనూ క్రీడలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీరజ్‌ ముదిరాజ్‌, వెంకటేష్‌ గౌడ్‌, గోపాల్‌, టోర్నమెంట్‌ నిర్వాహకులు యాదగిరి, శ్రీకాంత్‌, రాఘవేందర్‌, శేఖర్‌, అభిలాష్‌, భాస్కర్‌తోపాటు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>