కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కరెంట్ కోతలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ (Yadadri Power Plant)లో విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు అయిదుగురు ఐఏఎస్లను ప్రత్యేకాధికారులుగా పంపిస్తోంది . 15, 16, 17వ తేదీల్లో చెవ్వూరు హరికిరణ్, 18, 19వ తేదీల్లో వెంకటేశ్ ధోత్రే, 22, 23, 24వ తేదీల్లో రాహుల్ రాజ్, 25, 26, 27వ తేదీల్లో హనుమంతు కొండిబా జెండగే, 28, 29, 30వ తేదీల్లో శివ కుమార్ నాయుడును నియమించింది. ఈ అయిదుగురు ఐఏఎస్ అధికారులు తమకు కేటాయించిన రోజుల్లో యాదాద్రి పవర్ ప్లాంట్లోనే ఉండి.. విద్యుత్తు సరఫరా సక్రమంగా జరిగేలా, సమస్యలు ఉంటే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
ప్రధాన బాధ్యతలు ఇవే..
యాదాద్రి పవర్ ప్లాంట్(Yadadri Power Plant)లో నియమితులైన అయిదుగురు ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. పవర్ ప్లాంట్లోని నాలుగు యూనిట్లు సక్రమంగానే పనిచేస్తున్నాయా..? లేకపోతే సమస్య ఎక్కడ వస్తోంది..? దానికి పరిష్కారాలేంటనేది కనుక్కోవాలి. అలాగే ప్లాంట్ పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నడుస్తోందా..? లేదా..? అనేది చెక్ చేయాలి. సరఫరా అవుతున్న బొగ్గు నాణ్యత ఎలా ఉందనేది పరిశీలించాలి. బీహెచ్ఈఎల్ చేపట్టాల్సిన పనులు ఇంకా పెండింగ్లో ఉంటే దానిపై నివేదిక సమర్పించాలి. బొగ్గు గనుల నుంచి రైల్వే రేక్ల అన్ లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
Also Read : నాలుగేళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. వధువు షాకింగ్ నిర్ణయం!
Follow Us On : WhatsApp

