కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో షబ్బీర్ అలీ (Shabbir Ali) ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన లేజర్ షో, బాణసంచా ప్రదర్శన, రావణ దహన కార్యక్రమాలను ఆయన వీక్షించారు. దసరా పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

