ఎల్‌నినో ప్రభావం.. సినీ నటులకు భట్టి కీలక విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్ : సినీ నటులు, యువ దర్శకులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో (El Nino) ప్రభావాలపై షార్ట్‌ఫిల్మ్‌లతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వాతావరణ మార్పులు, నీటి కొరతపై చైతన్య పరచాలన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు, భవిష్యత్తులో నీటి సంక్షోభం వంటి పరిస్థితులపై ప్రజలకు అర్ధమయ్యేలా షార్ట్ ఫిల్స్మ్ రూపొందించాలని భట్టి పిలుపునిచ్చారు.

నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణపై సందేశాలు ఇవ్వాలని సినీ నటులు, యువ దర్శకులకు భట్టి (Bhatti Vikramarka) కోరారు. వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడే సందేశాలు అందించేలా సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.

Also Read : పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>