కామన్వెల్త్ గేమ్స్: సెమీస్ దిశగా రూపా-పింకీ..!

క‌లం, వెబ్‌డెస్క్‌: కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games)లో భారత లాన్ బౌల్స్ జోడీ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. మహిళల జోడీ విభాగంలో రూపా రాణి తిర్కీ(Rupa Rani) , పింకీ సింగ్ (Pinki Singh) టోంగాపై టైబ్రేకర్‌లో 2-0తో విజయం సాధించి సెమీఫైనల్ అవకాశాలను మరింత బలపరిచారు. మహిళల జోడీ విభాగం (సెక్షన్-బి)లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి సెట్‌ను 5-2తో గెలుచుకుంది. అయితే మ్యాచ్ ఆరంభంలో టోంగా మెరుగైన ఆటతో 1-0 ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత రూపా, పింకీ అద్భుత సమన్వయంతో తిరిగి పుంజుకుని స్కోరును సమం చేశారు. అదే జోరును కొనసాగిస్తూ తొలి సెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.

రెండో సెట్‌లో టోంగా బలంగా తిరిగి వచ్చింది. తొలి మూడు ఎండ్లలోనే 6-0 ఆధిక్యం సాధించి భారత్‌పై ఒత్తిడి పెంచింది. రూపా, పింకీ చివరి వరకు పోరాడినా ఆ సెట్‌ను 6-4తో టోంగా గెలిచి మ్యాచ్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లింది. నిర్ణయాత్మక టైబ్రేకర్‌లో మాత్రం భారత జోడీ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. రూపా జట్టుకు ఆధిక్యం అందించగా, పింకీ మ్యాచ్‌ను విజయంతో ముగించారు. దీంతో భారత్ 2-0తో టైబ్రేకర్‌ను సొంతం చేసుకుని మరో విలువైన విజయాన్ని నమోదు చేసింది.

రూపా రాణి తిర్కీ, పింకీ సింగ్ ఇద్దరూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల ఫోర్స్ జట్టుతో కలిసి స్వర్ణ పతకం గెలిచిన సభ్యులే. ఆ అనుభవాన్ని ఈ మ్యాచ్‌లో కూడా చక్కగా వినియోగించారు. సెక్షన్-బిలో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. అయితే ఒక సెట్ ఎక్కువగా గెలిచిన కారణంగా ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. భారత్ మాత్రం సెమీఫైనల్ రేసులో బలమైన పోటీదారుగా కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>