కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ” పెద్ది”. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ నేపధ్యంలో మేకర్స్ వరుస ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిన్న విజయవాడలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా సూపర్ సక్సెస్ అయింది. దీనితో నేడు ‘పెద్ది’ మూవీ టీం హైదరాబాద్‌లో మీడియాతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. ఈ స్పెషల్ మీడియా మీట్ లో పెద్ది సినిమా విశేషాలు, షూటింగ్ అనుభవాల గురించి చిత్ర యూనిట్ తెలియజేయనుంది. ‘పెద్ది’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానులలో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నేటి మీడియా మీట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

