కలం, వెబ్ డెస్క్ : నరబలి (Human Sacrifice) ఇచ్చే ఉద్దేశంతో 22 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి-బెహ్రోర్ జిల్లా నుంచి అపహరణకు గురైన బాలుడిని ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో గుర్తించారు. బీహార్‌లోని ససారం ప్రాంతానికి చెందిన వివేక్ కుమార్ కుష్వాహా (34) ను నిందితుడిగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బలి ఇస్తే అతీంద్రియ శక్తులు వస్తాయని నమ్మిన నిందితుడు అక్టోబర్ 18న ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్ చేశాడు. బలి (Human Sacrifice) ఇచ్చేందుకు అనువైన ఆలయం కోసం సుమారు 50 గంటల పాటు పలు ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు మధురలోని కోసి కలాన్ సమీపంలోని కవర్ గ్రామంలోని కాళీమాత ఆలయంలో బాలుడి బలిచ్చేందుకు ప్లాన్ వేశాడు. ఆలయం లోపల బాలుడు ఏడుపు విన్న ఓ సాధువు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రక్షించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

