కలం, వెబ్ డెస్క్: ఇండియా కూటమి (INDIA Alliance) మరోసారి ఆందోళనలకు రెడీ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను రాజీనామా చేయాలని మరోసారి దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతుంది. ఈ మేరకు సాయంత్రం కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీలు ఢిల్లీలో సమావేశం కాబోతున్నాయి.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. నవంబర్ ఒకటో తేదీన ఆందోళన సభ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కడ చేపట్టాలనేది ఈ రోజు జరిగే సమావేశంలో నిర్ణయించనున్నారు. ఆందోళనలు చేసే నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఉంది.

