‘ఇది వైసీపీ కుట్ర’.. కూటమి పార్టీల కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల (AP Local Body Elections)ను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఎన్డీయే కూటమి పార్టీలు విమర్శించాయి. ఎన్నికలను నిర్వహించవద్దని 59 సార్లు కోర్టులను ఆశ్రయించిందని మండిపడ్డాయి. ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పేరుతో ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్​, పీవీఎన్ మాధవ్ ఈ ప్రకటనపై సంతకం చేశారు. ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై వైసీపీకి ఏమాత్రం శ్రద్ధ లేదు. ఎన్నికలు సాఫీగా సాగిపోతున్న తరుణంలో హింసను ప్రేరేపించింది. పోలీసులపైనే దాడులు చేసింది. ప్రజల కోసం వేసిన రోడ్లను తవ్వేసింది. ఇంకా ఘర్షణ పడుతూనే ఉంది’ అని కూటమి పార్టీలు మండిపడ్డాయి.

పారదర్శకంగా జరగాలని..

స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన అని ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. ‘వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు ఎలా జరిగేవో తెలుసు. కనీసం నామినేషన్లు కూడా వేసుకోలేని పరిస్థితి. ఎన్నికల అక్రమాలు, అధికార దుర్వినియోగంపై అప్పటి ఎన్నికల కమిషనర్ స్వయంగా కేంద్రానికే లేఖ రాశారు. తనకు భద్రత కల్పించాలని విన్నవించారు. ఇప్పుడు న్యాయంగా జరుగుతున్న ఎన్నికలు చూసి ఓర్వలేకపోతుంది. అందుకే అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల సంఘం తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా కూటమి పార్టీలు పాటిస్తాయి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగి.. మంచి నాయకులే ఎన్నికవాలి’ అని స్పష్టం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>